రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎండాకాలం కావటంతో గత వారం రోజుల నుంచి రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఒక పూట పాఠశాలలు నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో కొత్త వేళలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 12.30 వరకు స్కూళ్లు నిర్వహిస్తారు. టెన్త్ కాస్ల్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తారు.
