TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 16న జరుగనుంది. ఇంకా 35 రోజుల టైమ్ మాత్రమే ఉంది. చివరి అయిదు రోజులు రివిజన్‌కు వదిలేసినా.. సరిగ్గా నెల రోజులు మిగిలాయి. అందుకే అభ్యర్థులు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినా.. ఏ ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏయే టాపిక్స్ రివిజన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం.
జాగ్రఫీ:
ఇందులో ప్రపంచ, భారత, తెలంగాణ జాగ్రఫీ మూడు సబ్జెక్టులున్నాయి. ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణ జాగ్రఫీకి ఇవ్వాలి. తెలంగాణ జాగ్రఫీని 33 జిల్లాల సమగ్ర సమాచారంతో గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇండియా జాగ్రఫీ, చివరి ప్రాధాన్యత ప్రపంచ జాగ్రఫీకి ఇవ్వాలి. ఇండియన్ జాగ్రఫీలో భౌగోళిక నైసర్గిక స్వరూపం, జనాభా, అడవులు, రవాణా వ్యవస్థ, నదీ వివాదాలు, స్మార్ట్ సిటీలు చదవాలి. కోవిడ్ ప్రభావంతో పాటు రష్యా–ఉక్రెయిన్, నూతన దేశాల ఏర్పాటు, శ్రీలంక సంక్షోభం, అఫ్ఘనిస్థాన్ సమస్య, చైనా సరిహద్దులు, భారతదేశం ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల కారణంగా ఈ కోణంలో జాగ్రఫీ అంశాలను ఫోకస్ చేయాలి.
కరెంట్ ఎఫైర్స్:
ఇందులో మొత్తం మూడు అంశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ, అంతర్జాతీయ అంశాల మీద ప్రశ్నలు అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన విజయాలు తెలుసుకోవటం తప్పనిసరి. జాతీయ అంశాలలో గత సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన అంశాలను, పరీక్షకు ఆరు నెలల ముందు జరిగిన అంశాలను పరీక్ష కోణంలో చదవాలి. ఇటీవలి అంశాలను లోతుగా విశ్లేషించి చదవాలి.
అంతర్జాతీయ అంశాలకు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన వాటి మీద ఫోకస్ చేయాలి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్వాడ్ దేశాల సదస్సు, సౌత్ చైనా సముద్రం, జీ20 సమావేశం, బిమ్స్టెక్, ఆసియాన్, అపెక్ మొదలైన అంతర్జాతీయ సదస్సుల మీద ఫోకస్ చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో వార్తలో వచ్చిన ప్రదేశాలు, అంతర్జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న భారతీయుల గురించి చదువుకోవాలి.
Good
Sir please tell me the which qualification is required for the group1
Can you please post the same in English?
Good information tq