Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSరాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలు

రాష్ట్రాలు – కేంద్రపాలిత ప్రాంతాలు

అన్ని పోటీ పరీక్షల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీద తప్పనిసరి ప్రశ్నలు అడుగుతారు. ఇండియన్​ జాగ్రఫీ లో ఇది ఇంపార్టెంట్​ టాపిక్​. ప్రస్తుతం ​దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాబోయే పరీక్షల్లో వీటి నుంచి 2 నుంచి 4 ప్రశ్నలు అడిగే ఛాన్స్​ ఉంది. గోవా, నాగాలాండ్​ రాష్ట్రాలు ఏర్పడి 60 సంవత్సరాలు, మేఘాలయ, త్రిపుర, మణిపూర్​, హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. అందుకే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
స్టడీ మెటిరీయల్​ చదివిన తర్వాత కింద ఉన్న ప్రాక్టీస్​ టెస్ట్ అటెంప్ట్ చేయండి

లఢక్​:

జమ్ము కశ్మీర్​ పునర్విభజన చట్టం– 2019 ప్రకారం రెండు (1. జమ్మూ కశ్మీర్, 2.లఢక్) కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

లఢక్​ కేంద్రపాలిత ప్రాంతంలో కార్గిల్​, లేహ్​ జిల్లాలు ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతం కారకోమ్​, జాస్కార్​ శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. భారత్​లో అతిపెద్ద జిల్లా లే.

లఢక్​ రాజధాని లే. దీని వైశాల్యం 96,751 చదరపు కి.మీ. లఢక్​ను​ పాలించిన మొదటి రాజు పాల్గాయి–గోన్.

2011 జనాభా లెక్కల ప్రకారం లఢక్​ జనాభా 2.74 లక్షలు. దీని వైశాల్యం 82,665 చ.కి.మీ. ఇందులో చైనా 37,555 చ.కి.మీ చైనా ఆక్రమించుకుంది.

లఢక్​ మొదటి లెఫ్టినెంట్​ గవర్నర్ రాధా కృష్ణమాథూర్​. టిబెట్​కు ఏ భాషా, లిపి ఉంటుందో లఢక్​కి అదే ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ మాండలిక భాషలు ఉన్నాయి. అవి లఢకి, పుర్గి, బాల్టి, షిన, డార్డి. ‘కుషోక్​ బాకూలా రిమ్​పోచే’ విమానాశ్రయం సముద్ర మట్టం నుంచి 3,256 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

లఢక్​లో సుమోరిరి, ప్యాంగ్​గాంగ్​, కార్గిల్ పెన్సిలా సరస్సులు ఉన్నాయి. హెమిస్​, థిక్స్​సే, ఆల్చి, ముల్​బెక్​, రాంగ్​డమ్​ అనే మఠాలు ఉన్నాయి.

లఢక్​లో నుభ్రా, సురూ లోయలు ఉన్నాయి. నున్​కున్​, స్టోక్​ కాంగ్రి అనే ఎత్తైన శిఖరాలు గలవు. ఈ ప్రాంతంలో సింధు, గిల్జిట్​, జాస్కార్​, షైయొక్​, ఆస్టర్​ నదులు ప్రవహిస్తున్నాయి. దేశం​లో అధికంగా ఆఫ్రికాట్​ను ఉత్పత్తి చేసేది లఢక్​. ఈ ప్రాంతంలోనే జొజిల్లా సొరంగం ఉంది.

జమ్ముకశ్మీర్​:

2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ముకశ్మీర్​ జనాభా 1.25 కోట్లు. ఈ ప్రాంతానికి మొదటి లెఫ్టినెంట్​ గవర్నర్ గా​ గిరీష్​ చంద్ర ముర్ము.

అశోకుడు క్రీ.పూ.3వ శతాబ్దంలో కశ్మీర్​లో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. జమ్ము పేరు మహాభారతంలో ఉంది. మహారాజ హరిసింగ్​ భారత యూనియన్​కు అనుకూలంగా ‘ఇన్స్​ట్రుమెంట్​ ఆఫ్​ ఆక్సెసన్​’ మీద 1947 అక్టోబర్​ 26లో సంతకం చేశారు.

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్​లో శాసనసభ ఉంటుంది కానీ శాసనమండలి ఉండదు. రాష్ట్ర హోదా ఉన్నప్పుడు శాసనమండలి ఉండేది.

జమ్ము కశ్మీర్​లో ప్రాథమిక భాషలుగా ఉర్దూ, డోగ్రి, కశ్మీరీ, పహరి, పంజాబీ, లఢక్​, బాల్టి, గోజ్రి, డాద్రి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఉలార్​ సరస్సు ఉంది. కిషెన్​గంగా హైడ్రో ఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​ సైతం ఇక్కడే ఉంది.

దాద్రా, నగర్​ హవేలి అండ్​ డామన్​ డయ్యూ:

వీటి రాజధాని సిల్వసా. వైశాల్యం 603 చ.కి.మీ. ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,85,764 జనాభా ఉండేది.

గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్​, పోర్చుగీస్​, కొంకణి, వర్లీ ప్రాథమిక భాషలు. . పోర్చుగీసు వారు దాద్రా నగర్​ హవేలి ప్రాంతాన్ని 1954 ఆగస్టు 2 వరకు పాలించారు. డయ్యూను ఆక్రమించుకొని 1961 వరకు పరిపాలించారు.

దాద్రా, నగర్​ హవేలి దేశంలో భూపరివేష్టిత ప్రాంతం. దామన్​​ గంగా నది నాసిక్​ నుంచి ప్రవహిస్తూ డామన్​ జిల్లాల మధ్య రెండు భాగాలుగా విడిపోతూ మోతీ డామన్​, నాని డామన్​ పేర్లతో ప్రవహిస్తున్నాయి.

నాగాలాండ్​:

1963లో 16వ రాష్ట్రంగా నాగాలాండ్​ ఏర్పడింది. ఇక్కడ అంగామి, ఆవో, చాకేసాంగ్​, చాంగ్​, కుకి, కొన్​యాక్, కచారి, లోథ్​, పోమ్​, పొచూరి, రెంగ్మా, సంఘటమ్​, సుమి, యుమిచుంగ్రి, జెలియాంగ్​ అనే తెగలు ఉన్నాయి.

1961లో నాగాలాండ్​ అని పేరు పెట్టినా అధికారికంగా 1963 డిసెంబర్​లో నాగాలాండ్​ రాష్ట్రం ఏర్పడింది. రంగపహర్​, షాకిమ్​, సింగ్​ఫాన్​ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పాటు ఇంటాకి అనే జాతీయ పార్క్​ ఇక్కడ ఉంది.

హార్న్​బిల్​ పండుగ నాగాలాండ్​లో ప్రసిద్ధి చెందింది. ‘సరామతి’ అనే శిఖరం నాగాలాండ్​లో అతి ఎత్తైనది.

మేఘాలయ:

1970లో అసోంలో స్వంతత్ర ప్రతిపత్తిగల రాష్ట్రంగా ఉన్న మేఘాలయ, 1972లో సంపూర్ణ రాష్ట్రంగా ఏర్పడింది. ఖాసీ, జంయతియా, గారో అనే తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

భారత్​లో అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం మాసిన్​రామ్​ ఈ రాష్ట్రంలోనే ఉంది. తూర్పు నుంచి పడమరకు వరుసగా జయంతియా, ఖాసి, గారో అనే కొండలు ఉన్నాయి.

నాక్రేక్​ శిఖరం ఈ రాష్ట్రంలోనే ఉంది. నాక్రేక్​, బల్పక్రాయ్​ జాతీయ పార్కులు, నొంగ్​ ఖైల్లెమ్​, సిజు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి.

త్రిపుర:

1949 అక్టోబర్​లో త్రిపుర రాష్ట్రం భారత యూనియన్​లో భాగమైంది. ప్రారంభంలో పార్ట్​ సి రాష్ట్రంలో భాగంగా ఉండేది, 1972లో పూర్తి రాష్ట్రంగా ఆవిర్భవించింది.

ఈ రాష్ట్రంలో బెంగాలి, కొక్​బొరొక్​ అనే ప్రాథమిక భాషలు ప్రజలు మాట్లాడుతారు. త్రిపుర రాష్ట్రంతో బంగ్లాదేశ్​, అసోం, మిజోరాం సరిహద్దు కలిగి ఉన్నాయి.

మణిపూర్​:

1972లో మణిపూర్​ పూర్తి రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద విమానాశ్రయం ఇంపాల్​. కైబుల్​ లామ్​జావో జాతీయపార్క్​ ఈ రాష్ట్రంలో ఉంది. లోక్​ఢక్​ అనే సరస్సు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తుంది.

హిమాచల్​ ప్రదేశ్​:

1971లో హిమాచల్​ ప్రదేశ్​ 18వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ‘ఫ్రూట్​భౌల్​’ ఆఫ్ ది కంట్రీ అంటారు. హిందీ, పహరి భాషలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మాట్లాడుతారు.

గోవా:

వాస్కోడగామ భారతదేశానికి సముద్రమార్గాన్ని 1498లో కనిపెట్టాడు. గోవా ప్రజలు డిసెంబర్​ 19, 1961న స్వతంత్రులయ్యారు. అప్పటివరకు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేది.

1961లో గోవా, డామన్​ డయ్యు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉండగా, 1987 మే నెలలో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. గోవాలో ముర్ముగావో ముఖ్యమైన రేవు పట్టణం.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 14.59 లక్షలు ఉంది.

ప్రాక్టీస్​ టెస్ట్ (రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు) INDIAN GEOGRAPHY

రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు టెస్ట్

కానిస్టేబుల్​ ప్రాక్టీస్​ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్​ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.

అటెంప్ట్ చేయండి. మీ గోల్​ సాధించండి.

ఆల్ ది బెస్ట్

Leaderboard: రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు టెస్ట్

maximum of 20 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!