నీట్ 2022 ఎగ్జామ్ ముగిసింది. త్వరలోనే రిజల్ట్ విడుదల కానుంది. ఎంబీబీఎస్ లో చేరే విద్యార్థులు ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి.. తమకు వచ్చే ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుంది.. ఎక్కడ జాయిన్ కావాలనే.. అంచనాల్లో మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నింటా మొత్తం 91,927 సీట్లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం MBBS సీట్ల జాబితాను రిలీజ్ చేసింది. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 48,012 సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 43.915 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లితండ్రులకు ఉపయోగంగా ఉండేలా ఏ రాష్ట్రంలో ఎన్ని కాలేజీలున్నాయి… ఎన్ని సీట్లున్నాయి..అనే పూర్తి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
రాష్ట్రాల వారీగా MBBS సీట్ల జాబితా
State or Union Territory | Govt Colle ges | Govt Seats | Private Colleges | Private Seats | Total Colleges | Total Seats |
Andaman and Nicobar | 1 | 100 | 0 | 0 | 1 | 100 |
Andhra Pradesh | 13 | 2,485 | 18 | 2,850 | 31 | 5,335 |
Arunachal Pradesh | 1 | 50 | 0 | 0 | 1 | 50 |
Assam | 9 | 1,150 | 0 | 0 | 9 | 1,150 |
Bihar | 12 | 1,515 | 8 | 900 | 20 | 2,415 |
Chandigarh | 1 | 150 | 0 | 0 | 1 | 150 |
Chhattisgarh | 8 | 965 | 4 | 600 | 12 | 1,565 |
Dadra and Nagar Haveli | 1 | 150 | 0 | 0 | 1 | 150 |
Delhi | 8 | 1,247 | 2 | 250 | 10 | 1,497 |
Goa | 1 | 180 | 0 | 0 | 1 | 180 |
Gujarat | 18 | 3,700 | 13 | 2,000 | 31 | 5,700 |
Haryana | 5 | 710 | 7 | 950 | 12 | 1,660 |
Himachal Pradesh | 7 | 770 | 1 | 150 | 8 | 920 |
Jammu and Kashmir | 9 | 1,047 | 1 | 100 | 10 | 1,147 |
Jharkhand | 7 | 680 | 2 | 250 | 9 | 930 |
Karnataka | 21 | 3,150 | 42 | 6,995 | 63 | 10,145 |
Kerala | 10 | 1,555 | 21 | 2,700 | 31 | 4,255 |
Madhya Pradesh | 14 | 2,180 | 11 | 1,900 | 25 | 4,080 |
Maharashtra | 29 | 4,825 | 33 | 5,070 | 62 | 9,895 |
Manipur | 2 | 225 | 1 | 150 | 3 | 375 |
Meghalaya | 1 | 50 | 0 | 0 | 1 | 50 |
Mizoram | 1 | 100 | 0 | 0 | 1 | 100 |
Odisha | 9 | 1,375 | 4 | 750 | 13 | 2,125 |
Puducherry | 2 | 380 | 7 | 1,250 | 9 | 1,630 |
Punjab | 5 | 800 | 7 | 950 | 12 | 1,750 |
Rajasthan | 17 | 3,055 | 9 | 950 | 26 | 4,005 |
Sikkim | 0 | 0 | 1 | 150 | 1 | 150 |
Tamil Nadu | 38 | 5,225 | 32 | 5,500 | 70 | 10,725 |
Telangana | 11 | 1,840 | 23 | 3,200 | 34 | 5,040 |
Tripura | 1 | 125 | 1 | 100 | 2 | 225 |
Uttara Pradesh | 35 | 4,303 | 32 | 4,750 | 67 | 9,053 |
Uttara khand | 5 | 700 | 3 | 450 | 8 | 1,150 |
West Bengal | 20 | 3,225 | 7 | 1,000 | 27 | 4,225 |
TOTAL | 322 | 48,012 | 290 | 43,915 | 612 | 91,927 |
ఈ జాబితా ప్రకారం తమిళనాడులో అత్యధిక మెడికల్ సీట్లు ఉన్నాయి. తమిళనాడులో విద్యార్థులకు మొత్తం 10,725 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీని తర్వాత కర్ణాటకలో 10,145 స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం 9,895 సీట్లు ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 9,053 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 5040 MBBS సీట్లున్నాయి.
ఈ ఏడాది జులై 17న జరిగిన NEET 2022 పరీక్షకు దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసే ప్రిలిమినరీ ఆన్సర్ కీ, ఫైనల్ కీ రిలీజ్ అయ్యాక.. ఆగస్టు మొదటి వారంలో రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశముంది. NTA అఫిషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ డైరెక్ట్ లింక్‌ను merupulu.com అందిస్తుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే నీట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.
Good
సర్ మా అమ్మాయికి 202 /720 మార్కులు వచ్చాయి S.T caste లో దేశంలో ఎక్కడైనా సీటు వచ్చే అవకాశం ఉంటే చెప్పగలరు దయచేసి