కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పని చేయాలనుకునే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా 731 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, ‘డి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉండి, స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2026- పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు: 731
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 15 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కరెక్షన్ విండో: మే 20, 21 తేదీల్లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ (CBT): జూలై లేదా ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
అర్హతలు:
అభ్యర్థులు 01.08.2026 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం తప్పనిసరి.
వయస్సు :
01.08.2026 నాటికి అభ్యర్థుల వయస్సు కింది విధంగా ఉండాలి.
1.గ్రేడ్ C పోస్టులు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
2.గ్రేడ్ D: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు
ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు :
గ్రేడ్ C: పే లెవల్-7 (రూ. 44,900 – 1,42,400). సంవత్సరానికి ప్యాకేజీ సుమారు రూ. 10-12 లక్షలు ఉంటుంది.
గ్రేడ్ D: పే లెవల్-4 (రూ. 25,500 – 81,100).సంవత్సరానికి ప్యాకేజీ సుమారు రూ. 6-8 లక్షలు ఉంటుంది.
వీటితో పాటు DA, HRA, ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది.
1.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ (50), జనరల్ అవేర్‌నెస్ (50), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (100) అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
2.స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్: గ్రేడ్ సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాల వేగం, గ్రేడ్ డి అభ్యర్థులు నిమిషానికి 80 పదాల వేగంతో స్టెనోగ్రఫీ టెస్ట్ పాస్ కావాలి. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.
3.డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. మహిళలు/ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు/మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు .
అప్లై చేయడం ఎలా?
అర్హత కలిగిన అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ముందుగా ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)’ పూర్తి చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి స్టెనోగ్రాఫర్ 2026 సెక్షన్‌లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.





