స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, ‘డి’ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హత ఉండి, స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఇందుకు అర్హులు. మే 15 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 731
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులకు స్టెనోగ్రఫీలో నైపుణ్యం తప్పనిసరి.
వయోపరిమితి (01.08.2026 నాటికి):
గ్రేడ్ ‘సి’ పోస్టులకు అప్లై చేసుకునే వారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రేడ్ ‘డి పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ వర్గాలకు (SC/ST కి 5 ఏళ్లు, OBC కి 3 ఏళ్లు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు (PwBD),మాజీ సైనికులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: అభ్యర్థులు మే 15 వ తేదీ రాత్రి 11 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు చెల్లింపు గడువు: మే 16
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): జూలై లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (50), జనరల్ అవేర్‌నెస్ (50), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (100)కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి గ్రేడ్ సి (100 wpm), గ్రేడ్ డి (80 wpm) వేగంతో స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెరిట్ ఆధారంగా ఎంపికైన వారికి సంబంధిత శాఖలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాయి.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





