కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 3,003 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు మే 4 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
SSC ఫేజ్ 14 నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఏడాది వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఫేజ్ 14 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఎన్నో రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత, వయస్సు:
ఈ నోటిఫికేషన్‌లో మూడు స్థాయిల్లో ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
సాధారణ, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD), మాజీ సైనికులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ల నుంచి మొత్తం 100 ప్రశ్నలు (200 మార్కులు) అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్ష జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు.. కానీ ప్రతి పోస్టుకు విడివిడిగా ఫీజు చెల్లించాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెజ్ సైట్ సంప్రదించవచ్చు.





