భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్-X సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా మొత్తం 1920 పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మే 12 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.ssc.nic.in వెబ్సైట్ సంప్రదించాలి.