స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పదో తరగతి అర్హతతో వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ నిర్వహిస్తోంది
ఖాళీలు: మొత్తం 39,481 పోస్టుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్): 15,654, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్): 7,145, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్): 11,541, సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ): 819, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 3017, అస్సాం రైఫిల్స్(ఏఆర్): 1248, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్): 35, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ): 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. వయసు 18 నుంచి జనవరి 2025 నాటికి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతం: పే లెవెల్-1 కింద ఎన్‌సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ.18,000- నుంచి రూ.56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్-3 కింద రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.