స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)గ్రేడ్ ‘సి’ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 326 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (LDCE)ద్వారా జరిగే నియామకం. ఇప్పటికే గ్రేడ్ ‘డి’ స్టెనోగ్రాఫర్‌లుగా పనిచేస్తున్న వారు ఈ పదోన్నతికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 11 లోపు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విధానంలో అప్లై చేసుకోవాలి. పరీక్షా కేంద్రం ఢిల్లీలో మాత్రమే ఉంటుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 326
సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (CSSS)-267
సాయుధ దళాల ప్రధాన కార్యాలయం (AFHQ)- 37
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS – B)-13
రైల్వే బోర్డు స్టెనోగ్రాఫర్స్ సర్వీస్- 08
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా – 01
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC)- పోస్టులను త్వరలోనే వెల్లడిస్తారు.
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థి సంబంధిత సర్వీస్‌లో రెగ్యులర్ గ్రేడ్ ‘డి’ స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తూ ఉండాలి.
అనుభవం: కేడర్‌ను బట్టి 3 నుంచి 6 ఏళ్ల సర్వీస్ (01.07.2025 నాటికి) పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: నిర్దిష్ట వయోపరిమితి లేదు. సర్వీస్ నిబంధనల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు.
ఎంపిక విధానం:
ఎంపిక మూడు దశల్లో ఉంటుంది.
Part-A: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – 200 మార్కులు (జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్).
Part-B: షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ (హిందీ లేదా ఇంగ్లీష్) – 200 మార్కులు.
Part-C: సర్వీస్ రికార్డ్ (APARs)- 100 మార్కులు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ముందుగా SSC వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)చేసుకోవాలి.
తర్వాత లాగిన్ అయి, లైవ్ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత.. దాని ప్రింటౌట్, అవసరమైన డాక్యుమెంట్స్ నిర్ణీత గడువులోగా సబ్మిట్ చేయాలి.
మరిన్ని వివరాల కోసం.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ సంప్రదించవచ్చు.





