స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఎల్డీసీ(లోయర్ డివిజన్ క్లర్క్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ త్వరలో ఈ ఖాళీల వివరాలను వెల్లడించనుంది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 18-27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 7వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://ssc.nic.in/