స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ & ఎలక్ట్రికల్) పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మొత్తం 1340 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: జూన్ 30.
అప్లికేషన్స్ చివరి తేదీ: జులై 21.
ఖాళీల వివరాలు:
మొత్తం 1340 ఖాళీలు ప్రకటించారు. పోస్ట్, కేటగిరీ వారీగా ఖాళీల సంఖ్యను అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలోనే వెల్లడిస్తారు. ఈ పోస్టులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉంటాయి.
విద్యార్హతలు:
సంబంధిత విభాగంలో (సివిల్, మెకానికల్, లేదా ఎలక్ట్రికల్) ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. సాధారణంగా అభ్యర్థులు 30 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, SC/ST, OBC, PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.100. మహిళలు, SC, ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
పరీక్ష తేదీలు:
పేపర్-1 పరీక్ష (CBT): అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 మధ్య జరిగే అవకాశం ఉంది.
పేపర్-2 పరీక్ష: జనవరి – ఫిబ్రవరి 2026 (తాత్కాలికంగా).
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:
పేపర్- 1 (CBT): ఇది ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంజనీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్) అనే విభాగాలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్- 2 (CBT): పేపర్- 1లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే పేపర్- 2 రాయడానికి అర్హులు.
పేపర్- 1, పేపర్- 2లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు ఏడవ పే స్కేల్ ప్రకారం.. నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
అప్లికేషన్ విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
1.మొదట SSC అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in)కి లాగిన్ అవ్వండి
అప్లికేషన్ సబ్మిట్ చేసి.. ప్రింట్ అవుట్ తీసుకోండి.
2.”Apply” టాబ్‌పై క్లిక్ చేయండి.
3.కొత్త యూజర్ అయితే, “New User? Register Now” పై క్లిక్ చేసి, వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోండి.
4.రిజిస్ట్రేషన్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
5.అప్లి కేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. (వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు మొదలైనవి).
6.అవసరమైన పత్రాలను (ఫోటోగ్రాఫ్, సంతకం) అప్‌లోడ్ చేయండి.
7.అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
8.అప్లికేషన్ సబ్మిట్ చేసి.. ప్రింట్ అవుట్ తీసుకోండి.