ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 20 చివరి తేది.
పోస్టుల వివరాలు.
మొత్తం 509 పోస్టులుండగా.. ఇందులో మేల్ పోస్టులు 341, ఫీమేల్ పోస్టులు 168 ఉన్నాయి. అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ఇలా..
సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ గడువు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెంట్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష డిసెంబర్ లేదా జనవరి 2026లో నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://ssc.gov.in/ సంప్రదించండి.





