నిరుద్యోగులకు శుభ వార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25,487 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 31 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
సంస్థ- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
పోస్టు పేరు- కానిస్టేబుల్ (GD) & రైఫిల్‌మ్యాన్ (GD)
పోస్టుల సంఖ్య- 25, 487
అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in
అర్హతలు:
అభ్యర్థులు భారతదేశ పౌరులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి 01-01-2026 నాటికి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. NCC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు లభిస్తాయి .
వయస్సు: (01-01-2026 నాటికి )
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు ఉండాలి. (02-01-2003 కంటే ముందు , 01-01-2008 కంటే తరువాత జన్మించి ఉండకూడదు)
అప్లికేషన్ ఫీజు: జనరల్/OBC/EWS పురుష అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. SC/ST/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: అభ్యర్థులకు నెలకు రూ. 21,700 – 69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- సమగ్ర వైద్య పరీక్ష (DME) /RME)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in లోకి లాగిన్ అవ్వండి. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయండి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ పారమ్‌లో అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి. ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించండి. అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.





