స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 25,478 పోస్టులను భర్తీ చేయనుండగా.. ఇందులో బీఎస్ఎఫ్ 5,261 పోస్టులు, సీఐఎస్ఎఫ్ 14595, సీఆర్పిఎఫ్ 5490, ఎస్.ఎస్.బి. 1764 , ఐటీబీపీ 1293, ఏఆర్ 1706, ఎస్.ఎస్.ఎఫ్ 23 పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,105 వరకు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 494 పోస్టులు ఉండగా.. ఏపీలో 611 ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 25,487
పురుషులు: 23,467 పోస్టులు
మహిళలు: 2,020 పోస్టులు
వివిధ దళాల్లో ఖాళీల వివరాలు:
BSF: 5,261
CISF: 14,595
CRPF: 5,490
SSB: 1,764
ITBP: 1,293
AR (రైఫిల్‌మ్యాన్): 1,706
SSF: 253
అర్హతలు :
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
జాతీయత: భారతీయ పౌరుడై ఉండాలి.
వయస్సు:
01-01-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2003 కంటే ముందు, 01-01-2008 తర్వాత జన్మించి ఉండకూడదు. SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం లభిస్తుంది. దీంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE): ఫిబ్రవరి – ఏప్రిల్ 2026 మధ్య నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): ఎత్తు, ఛాతి కొలతలు చూస్తారు.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET): రన్నింగ్ తదితర పరీక్షలు ఉంటాయి.
వైద్య పరీక్ష (DME/RME): శారీరక సామర్థ్యం, ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ చివరి తేదీ: డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లై చేయడం ఎలా ?
1.అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.
2.మొదటి సారి అప్లై చేసే One-Time Registration (OTR) పూర్తి చేయాలి.
3.ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడితో లాగిన్ అయి, ‘Constable (GD) Recruitment 2025’ లింక్ పై క్లిక్ చేయాలి.
4.మీ వివరాలను ఎంటర్ చేసి,ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
5.ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.





