దేశంలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్ అర్హత కలిగి ఉన్న అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు & పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 2,536 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
విద్యార్హతలు :
LDC / JSA, సాధారణ DEO పోస్టులు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
DEO / DEO గ్రేడ్ ‘A’ (కొన్ని నిర్దిష్ట మంత్రిత్వ శాఖలలో): అభ్యర్థులు సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ పాస్ అయి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు , పీడబ్ల్యూడీ అభ్యర్థులకు తగిన వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
సెవెన్త్ పే కమిషన్ (7th CPC) ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు జీతం ఇస్తారు.
LDC / JSA పోస్టులు: పే లెవెల్-2 అంటే రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు జీతం ఉంటుంది.
DEO పోస్టులు: పే లెవెల్-4 , పే లెవెల్-5 అంటే.. రూ. 25,500 నుంచి రూ. 92,300 వరకు జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 100 ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ , మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఫీజును ఆన్లైన్ మోడ్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్) ద్వారా చెల్లించవచ్చు.
అప్లికేషన్లకు చివరి తేదీ:
ఆన్లైన్ అప్లికేషన్లకు అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల వరకు మాత్రమే గడువు ఉంది.
ఎంపిక విధానం :
ఈ రిక్రూట్మెంట్లో ఎంపిక ప్రక్రియ రెండు విధాల్లో (Tier-I, Tier-II) కంప్యూటర్ ఆధారిత పరీక్షద్వారా జరుగుతుంది. టైర్-1 పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి టైర్-2 పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అప్లై చేయడం ఎలా?
అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లేదా ‘మై ఎస్ఎస్సీ’ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.





