HomeJOBSడిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు.. అప్లికేషన్లకు ఒక్క రోజే ఛాన్స్

డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు.. అప్లికేషన్లకు ఒక్క రోజే ఛాన్స్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదల చేసిస సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న మొత్తం 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ అప్లికేషన్లు రేపటితో ముగుస్తాయి కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ:
జూన్ 22 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: జూన్ 23 .

అప్లికేషన్ కరెక్షన్ విండో: జూన్ 29 నుంచి జులై 01 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

టైర్-1 పరీక్ష : ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జరుగుతుంది. టైర్-2 పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు & జీతం:
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ టాక్స్/సెంట్రల్ ఎక్సైజ్), సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/NIA), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ వంటి ఎన్నో రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

జీతం:
పోస్ట్‌ను బట్టి పే లెవెల్ 4 (రూ. 25,500 – 81,100) నుంచి పే లెవెల్ 8 (రూ. 47,600 – 1,51,100) వరకు నెలకు జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.

అర్హతలు & వయోపరిమితి:
అప్లై చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాసై ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేయవచ్చు, కానీ ఆగస్ట్ 1 నాటికి డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు:
సాధారణ పోస్టులకు వయస్సు 18 నుంచి 27 ఏళ్లు లేదా 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. జేఎస్‌ఓ పోస్టుకు గరిష్టంగా 32 ఏళ్ల వరకు అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులతో పాటు మహిళా అభ్యర్థులందరికీ ఎలాంటి ఫీజు లేదు.

ఆసక్తి గల అభ్యర్థులు ssc.gov.in లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకుని అప్లై చేసుకోవాచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here