HomeJOBSడిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి!

డిగ్రీ అర్హతతో 12,256 ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 12,256 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్, సిబిఐ, ఈడీ, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్ఠాత్మక ఉద్యోగాలు సాధించవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆన్‌లైన్ అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభమవగా.. దరఖాస్తులకు జూన్ 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నోటిఫికేషన్ వివరాలు:

అర్హతలు:
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే. కానీ 01-08-2026 నాటికి డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు: పోస్టును బట్టి 18 నుంచి 30 ఏళ్ల (JSO పోస్టుకు 32 ఏళ్లు) వయస్సు ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. వయస్సును 01-08-2026 ఆధారంగా లెక్కిస్తారు.

అప్లికేషన్ ఫీజు:
జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు కేవలం రూ. 100 మాత్రమే. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఖాళీలు, జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే లెవెల్ 4 నుంచి పే లెవెల్ 8 వరకు జీతం లభిస్తుంది. బేసిక్ పే లెవెల్ 4 కింద రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుంది. అలాగే అత్యున్నత స్థాయి పోస్టులకు పే లెవెల్ 8 కింద రూ. 47,600 నుంచి రూ. 1,51,100 వరకు ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి.

ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక.. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBE) ద్వారా జరుగుతుంది.

టైర్-1 (Tier-I Exam): ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జరుగుతుంది. ఇందులో రీజనింగ్, జీకే, మ్యాథ్స్, ఇంగ్లీష్ నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

టైర్-2 (Tier-II Exam): ఈ పరీక్ష డిసెంబర్‌లో నిర్వహిస్తారు. ఇందులోని మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ (DEST) క్వాలిఫైయింగ్ పద్ధతిలో ఉంటాయి.

అప్లై చేసుకునే విధానం:
వెబ్‌సైట్, ఓటీఆర్ (OTR):
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in లేదా mY SSC మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మొదట అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ‘వన్-టైమ్ రిజిస్ట్రేషన్’ను పూర్తి చేయడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ కార్డ్ వివరాలను ఉపయోగించడం మంచిది. ఓటీఆర్ ప్రొఫైల్ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని లాక్ చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫారమ్ :
ఓటీఆర్ పూర్తయిన తర్వాత కామన్ అప్లికేషన్ ఫారంను పూర్తి చేయాలి. ఈసారి అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ కంప్యూటర్ లేదా మొబైల్ కెమెరా ద్వారా ప్రత్యక్షంగా ఫోటో తీయాల్సి ఉంటుంది. పాత ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి వీల్లేదు. దీంతో పాటు స్కాన్ చేసిన మీ సంతకాన్ని JPEG/JPG ఫార్మాట్‌లో, 10 నుంచి 20 KB సైజులో (6.0 సెం.మీ × 2.0 సెం.మీ కొలతలతో) అప్‌లోడ్ చేయాలి.

పరీక్షా కేంద్రాలు:
ఆ తర్వాత ఎగ్జామ్ స్పెసిఫిక్ మాడ్యూల్‌ను పూర్తి చేయాలి. ఇందులో మీరు కోరుకునే ఉద్యోగాల ప్రాధాన్యతలను ఎంచుకోవాలి. అలాగే పరీక్ష రాయాలనుకునే 3 పరీక్షా కేంద్రాలను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే 3 కేంద్రాలు కూడా ఒకే రీజియన్ కింద ఉండాలి.

ఫీజు చెల్లింపు:
అప్లికేషన్ పూర్తయిన తర్వాత వర్తించే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అప్లికేషన్‌ను ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు, ఎంటర్ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ‘ప్రివ్యూ’ ఆప్షన్‌ను ఉపయోగించి, ఒక ప్రింటవుట్ తీసుకోవాలి.

కరెక్షన్ విండో:
అప్లికేషన్ తర్వాత ఒకవేళ ఏవైనా తప్పులు జరిగితే, వాటిని సరిచేసుకోవడానికి కమిషన్ కరెక్షన్ విండో అందిస్తుంది. అభ్యర్థులు 29-06-2026 నుంచి 01-07-2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తప్పులను సరి చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా కరెక్షన్ ఫీజు వర్తిస్తుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here