HomeJOBSఎస్ఎస్‌సీ సీజీఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఎస్ఎస్‌సీ సీజీఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామినేషన్-2026 పరీక్ష తేదీలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సీజీఎల్ టైర్-1 పరీక్షలను ఈ నెల సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సుమారు 12,256 ఖాళీలను భర్తీ చేయనుండటంతో.. అభ్యర్థులలో పోటీ విపరీతంగా పెరిగింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు..

అడ్మిట్ కార్డులు:
ఈ పరీక్షలన్నీ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. పరీక్ష ప్రారంభానికి 10 నుంచి 15 రోజుల ముందే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షా కేంద్రం, షిఫ్ట్ సమయం వంటి వివరాలు అడ్మిట్ కార్డులో స్పష్టంగా పేర్కొంటారు. కాబట్టి అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి హాల్ టికెట్ పొందవచ్చు.

పరీక్షా విధానం:
టైర్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం నాలుగు ప్రధాన విభాగాలు ఉంటాయి.

1.జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు – 50 మార్కులు)

2.జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు – 50 మార్కులు)

3.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు – 50 మార్కులు)

4.ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు – 50 మార్కులు)

మొత్తం 100 ప్రశ్నలకు గాను 200 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం కేవలం 1 గంట మాత్రమే. ఈ ఏడాది నుంచి సెక్షనల్ టైమింగ్ నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్ ఉంటుందని కమీషన్ స్పష్టం చేసింది. ఇంగ్లీష్ విభాగం మినహా మిగిలిన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక కీ ని విడుదల చేసేందుకు ఎస్ఎస్‌సీ కసరత్తు చేస్తోంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here