HomeJOBSగుడ్ న్యూస్.. SSB కానిస్టేబుల్ దరఖాస్తు గడువు పెంపు, కొత్త తేదీ ఇదే!

గుడ్ న్యూస్.. SSB కానిస్టేబుల్ దరఖాస్తు గడువు పెంపు, కొత్త తేదీ ఇదే!

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ (SSB), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్ & డ్రైవర్) పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ గడువు ముగియడంతో తాజగా దీనిని మే 10వ తేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే.. మొత్తం 827 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

SSB కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026-పూర్తి వివరాలు:

ఖాళీల వివరాలు:
మొత్తం 827 పోస్టులలో వివిధ రకాల ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి.

కానిస్టేబుల్ (డ్రైవర్ – పురుషులు): 553 పోస్టులు

కానిస్టేబుల్ (వెటర్నరీ): 34 పోస్టులు

ఇతర ట్రేడ్స్: వాషర్‌మ్యాన్ (74), బార్బర్ (43), గార్డెనర్ (41), టైలర్ (41), కాబ్లర్ (25)తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం లెవల్-3 జీతం (రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు) లభిస్తుంది.

అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవర్ పోస్టులకు ‘హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ తప్పనిసరి. ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ (ITI) లేదా అనుభవం ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు (SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
SSB అభ్యర్థులను ఈ కింది దశల ద్వారా ఎంపిక చేస్తుంది.

PET & PST: శారీరక సామర్థ్య పరీక్ష (రన్నింగ్), శారీరక ప్రమాణాల పరీక్ష (ఎత్తు, ఛాతీ కొలతలు).

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ తరహాలో జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్, ట్రేడ్ సంబంధిత అంశాలపై పరీక్ష ఉంటుంది.

ట్రేడ్ టెస్ట్ : అభ్యర్థికి సంబంధిత పనిలో ఉన్న నైపుణ్యాన్ని పరిశీలిస్తారు.

డాక్యుమెంటేషన్ & మెడికల్: ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ , మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్,మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు .

మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ssb.gov.in సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here