సాయుధ సీమా బల్ (SSB) స్పోర్ట్స్ కోటా కింద 404 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో పాటు గత రెండేళ్లలో క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థుల వయస్సు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి 69,100 జీతం లభిస్తుంది. ఆసక్తి గలవారు జూన్ 7 లోపు www.recruitment.ssb.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంటేషన్, ఫిజికల్ టెస్ట్, ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి.
రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 400
మొత్తం 404 ఖాళీలలో పురుషులు,మహిళా క్రీడాకారులకు అవకాశం కల్పించారు. సుమారు 28 రకాల క్రీడా విభాగాలలో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన విభాగాలు: అథ్లెటిక్స్ (42), హాకీ (28), రెజ్లింగ్ (27), ఫుట్‌బాల్ (22), బాస్కెట్‌బాల్ (21), బాక్సింగ్ (18), వూషు (16). ఇవే కాకుండా ఆర్కరీ, స్విమ్మింగ్, జుడో, కబడ్డీ వంటి విభాగాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
క్రీడా అర్హత: గత రెండేళ్లలో (కట్ ఆఫ్ తేదీ నాటికి) అంతర్జాతీయ పోటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా సీనియర్/జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సాధించి ఉండాలి. ఖేలో ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో మెడల్స్ సాధించిన వారు కూడా అర్హులే.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.(ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు, ఓబీసీలకు 8 ఏళ్ల వరకు వయో సడలింపు లభిస్తుంది (స్పోర్ట్స్ కోటా సడలింపుతో కలిపి)
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు పే మేట్రిక్స్ లెవల్-3 ప్రకారం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం అందుతుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానంలో ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత క్రీడా విజయాలు, శారీరక ప్రమాణాల పరీక్ష (PST), ఫీల్డ్ ట్రయల్ , చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
అప్లికేషన్ :
ఆసక్తి గల అభ్యర్థులు SSB అధికారిక వెబ్‌సైట్ www.recruitment.ssb.gov.in ద్వారా జూన్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు.





