హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీజీ, పీజీ డిప్లొమా,డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధారణ ఫీజుతో జూన్ 24 వరకు, లేట్ ఫీజుతో జూన్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆసక్తి గల వారు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
తెలుగు వర్సిటీ సంప్రదాయ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు ఉన్న ఆధునిక కోర్సులను కూడా అందిస్తోంది. శిల్పం, చిత్రలేఖనం, జ్యోతిష్యం, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటితో పాటు సమాజంలో మంచి ఆదరణ ఉన్న యోగా, మ్యాజిక్, పద్యనాటకం, లలిత సంగీతం తదితర విభిన్న కోర్సులను కూడా వర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. తమ ఆసక్తులకు అనుగుణంగా అభ్యర్థులు నచ్చిన కోర్సును ఎంచుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా సాధారణ ఫీజుతో జూన్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ గడువులోగా అప్లై చేసుకోలేని వారికి లేట్ ఫీజుతో జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్షలు, అర్హతలు, ఫీజుల వివరాలు, ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ pstucet.org సందర్శించవచ్చని రిజిస్ట్రార్ సూచించారు.





