తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్ట్ 19,20 తేదీల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 1,131 సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ద్వారా నేరుగా అడ్మిషన్లు పొందవచ్చు.
ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,131 డీఈడీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో.. ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 235 సీట్లు ఉండగా.. ప్రైయివేటు కాలేజీల్లో 579 సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (EWS) కోటాలో మిగిలిన సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కౌన్సెలింగ్ విధానం:
ఈ స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చు.
ఆగస్టు 19: ప్రభుత్వ డైట్ కాలేజీల్లోని ఖాళీ సీట్ల భర్తీకి ఆగస్ట్ 19న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఆగస్టు 20: ప్రయివేట్ కాలేజీల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఆగస్ట్ 20వ తేదీన కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఈ కౌన్సెలింగ్ సీట్లు కాళీగా ఉన్న కాలేజీల్లో నిర్వహిస్తారు. అందుకే.. డీఈడీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు నేరుగా తాము కోరుకున్న కాలేజీలను సంప్రదించి, అవసరమైన డాక్యుమెంట్స్‌తో స్పాట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.





