HomeLATESTఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ ​

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్​ పోస్టులకు నోటిఫికేషన్​ ​

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లికేషన్స్​ కోరుతోంది

ఖాళీలు: మొత్తం 58 పోస్టుల్లో డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ 3, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 30, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విభాగాలు: ఐటీ- ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆపరేషన్స్‌, సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెంటర్ ఆపరేషన్స్, ప్రొక్యుర్‌మెంట్ అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/ ఐటీ), ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 31 నుంచి -45 ఏళ్లు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 29- నుంచి 42 ఏళ్లు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27- నుంచి 40 ఏళ్లు మించకూడదు.

జీతం: ఏడాదికి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.45 లక్షలు; అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు రూ.35 లక్షలు; సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రూ.29 లక్షలు.

సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ తదితరాల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!