రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు దక్షిణ రైల్వే గుడ్ నూస్ అందించింది. ఈ ఏడాదికి గాను పెరంబూర్, పొన్మలై, పోదనూర్ వంటి ప్రముఖ వర్క్‌షాప్‌లు , వివిధ డివిజన్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,471 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 27 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,471 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు.
ఫ్రెషర్ కేటగిరీ: మొత్తం 163 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్-ఐటీఐ (Ex-ITI) కేటగిరీ: మొత్తం 4,308 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రిషియన్, వైర్‌మెన్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి అనేక రకాల ట్రేడ్స్‌కు చెందిన ఖాళీలు పెరంబూర్, పొన్మలై, పోదనూర్ వర్క్‌షాప్‌లు , వివిధ డివిజన్లలో భర్తీ చేస్తారు.
అర్హతలు:
విద్యార్హతలు: ఫ్రెషర్ కేటగిరీకి టెన్త్ లేదా ఇంటర్ (సైన్స్ గ్రూప్) కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఎక్స్-ఐటీఐ కేటగిరీకి టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీస మార్కుల నిబంధనలో సడలింపు ఉంది.
వయో పరిమితి: నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి అభ్యర్థుల కనీస వయసు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు ఫ్రెషర్/ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు 22 సంవత్సరాలు, ఎంబీటీ పోస్టులకు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
సెలక్షన్ ప్రాసెస్:
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ జాబితా ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. ఫ్రెషర్లకు టెన్త్ మార్కులు, ఎక్స్-ఐటీఐ వారికి ఐటీఐ మార్కులకు సమాన వెయిటేజీ ఇచ్చి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఈ అప్రెంటీస్ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రతి నెలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ అందిస్తారు.
చివరి తేదీ:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. చివరి తేదీ సెప్టెంబర్ 27 (సాయంత్రం 5:00 గంటల వరకు) ఉంది.
అప్లికషన్ విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ , మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.





