ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)… 2024-–2025 సంవత్సరానికి సంబంధించి రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIII (సీఆర్‌పీ) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్(స్కేల్-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్)/ క్లర్క్ పోస్టుల భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలుంటాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్షలు: ఆగస్టు 3, 4, 10, 17, 18 వ తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ 29, అక్టోబర్ 6న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.