HomeJOBSఏయే పేపర్లు లీకయ్యాయి..? సిట్​ దర్యాప్తులో సంచలన అంశాలు

ఏయే పేపర్లు లీకయ్యాయి..? సిట్​ దర్యాప్తులో సంచలన అంశాలు

టీఎస్​పీఎస్​సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో తవ్విన కొద్దీ.. మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్ ఎన్ని పేపర్లు లీక్​ చేశాడు.. అతని పెన్​ డ్రైవ్​లో ఎన్ని పేపర్లున్నాయి.. అనే కోణంలో సిట్​ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రవీణ్​ గ్రూప్​ వన్​ పరీక్ష రాయటం, 103 మార్కులు బబ్లింగ్​ చేసిన ప్రవీణ్​ ఓఎంఆర్​ షీట్ బయటపడటంతో గ్రూప్​ వన్​ పేపర్​ లీకైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ప్రవీణ్​, రాజశేఖర్​, గురుకుల్​ టీచర్​ రేణుక, ఆమె భర్త పక్కా ప్లాన్​ ప్రకారం ఏఈ పేపర్​ను లీక్​ చేసి.. అభ్యర్థులకు అమ్ముకోవటంతో ఈ వ్యవహారం గుట్టు రట్టయింది. ప్రవీణ్ పెన్​ డ్రైవ్​లో మరో మూడు పేపర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఈ ఎగ్జామ్​తో పాటు టౌన్​ ప్లానింగ్​ బిల్డింగ్​ ఓవర్​సీస్​, వెటర్నరీ అసిస్టెంట్​ సర్జన్​, అసిస్టెంట్​ మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​, గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​ లోని పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్​ పేపర్లు ప్రవీణ్ పెన్​ డ్రైవ్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్​సీ అధికారికంగా ప్రకటించింది.

లీకైనట్లు అనుమానించిన రోజునే 12న జరగాల్సిన టౌన్​ ప్లానింగ్​ ఎగ్జామ్​ తో పాటు.. 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్​ సర్జన్​ పరీక్షలను వాయిదా వేసింది. అసిస్టెంట్​ మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​, గ్రౌండ్​ వాటర్​ డిపార్టుమెంట్​ పోస్టుల ఎగ్జామ్​లు ఇంకా జరగలేదు. ప్రవీణ్ ఈ పేపర్లన్నీరెండు మూడు రోజుల ముందు లీక్​ చేసి అభ్యర్థులకు అమ్ముకునేందుకు ప్లాన్​ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్​ రాజశేఖర్​ టీచర్​ రేణుక సాయంతోనే ఈ లీకేజీ దందాకు పాల్పడినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.

దర్యాప్లులో భాగంగా సిట్​ చీఫ్​ ఏఆర్​ శ్రీనివాస్ గురువారం​ టీఎస్పీఎస్సీ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. సెక్షన్​ ఆఫీసర్​ సిస్టమ్​ పాస్​ వర్డ్ ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రవీణ్ కి లబ్ధి చేకూర్చేందుకు కంప్యూటర్ లాన్ లో రాజశేఖర్​ పలు మార్పులు చేసినట్లు గుర్తించారు. అయిదు పేపర్లను ప్రవీణ్ తన పెన్ డ్రైవ్ లో పేపర్స్ ని సేవ్ చేసుకున్నాడని, భవిష్యత్లులో జరిగే అన్ని పేపర్లు ఇస్తానని రేణుక కు ప్రవీణ్​ మాట ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. పరీక్షలు రాయబోయే అభ్యర్థులను వెతికి పేపర్లకు బేరం మాట్లాడి పెట్టాలని ప్రవీణ్​ రేణుకకు చెప్పినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

Advertisement

వరుసగా వెలుగుజూస్తున్న ప్రవీణ్​ లీలలతో పేపర్​ లీకేజీ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందనే ఆందోళన నిరుద్యోగులను వెంటాడుతోంది. ప్రధానంగా గ్రూప్​ 1 పరీక్షపై టీఎస్​పీఎస్​సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. పేపర్​ లీకేజీ జరిగిన తీరుపై… టీఎస్​పీఎస్​సీ నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతుండటంతో ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రశ్నార్థకంగానే మారింది. బోర్డు ఛైర్మన్ తో పాటు మెంబర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయని లక్షలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!