HomeADMISSIONSకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు.. పూర్తి వివరాలు ఇవే!

కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు.. పూర్తి వివరాలు ఇవే!

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీలో.. రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో అడ్మిషన్ల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. వ్యవసాయ, ఉద్యానవన రంగాలపై ఆసక్తి ఉన్న పదో తరగతి విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశం. ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 6లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ ప్రక్రియకు సంబంధించి సీట్ల సంఖ్య, అప్లికేషన్ విధానంతో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. కాలేజీలు- సీట్ల వివరాలు:
    ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు (ఇంగ్లీష్ మీడియం). ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

హార్టికల్చర్ పాలిటెక్, ఆదిలాబాద్: 40 సీట్లు

హార్టికల్చర్ పాలిటెక్నిక్, రామగిరిఖిల్లా (పెద్దపల్లి): 40 సీట్లు

హార్టికల్చర్ పాలిటెక్నిక్, కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్): 40 సీట్లు

గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్, సూర్యాపేట: 40 సీట్లు

మొత్తం సీట్లలో 60% సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. అలాగే కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఈ సీట్లలో 100% ప్రవేశాలు కల్పిస్తారు.

2.అర్హతలు:
1.టెన్త్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

    2.టెన్త్ క్లాస్‌లో సైన్స్ ఒక సబ్జెక్టుగా ఉండి, కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి.

    3.ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

    గమనిక: ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ కోర్సుకు అర్హులు కారు.

    వయస్సు: అభ్యర్థుల వయస్సు 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

    3.ఎంపిక విధానం: టెన్త్ లో సాధించిన మార్కుల (GPA) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

      4. ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు (PH)అప్లికేషన్ ఫీజు రూ.800, ఇతరులకు (General/OBC) రూ.1,100 గా నిర్ణయించారు. దీనిని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి.

      5. అప్లికేషన్లకు చివరి తేదీ: జులై6 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

      6.అప్లికేషన్ ప్రక్రియ:
      ఈ ప్రవేశాలకు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్లను జతచేయాలి. గ్రామీణ కోటా కింద అప్లై చేసుకునే వారు తప్పనిసరిగా ‘నాన్-మున్సిపల్ ఏరియా’ సర్టిఫికెట్‌ను యాడ్ చేయడం మర్చిపోవద్దు. పూర్తి చేసిన అప్లికేషన్ ను వర్సిటీ అడ్రస్‌కు చేరేలా పంపించాలి.

        RELATED ARTICLES
        WhatsApp Icon
        JOIN OUR
        WHATSAPP GROUP
        CLICK THIS LINK
        PRACTICE TEST
        TELANGANA HISTORY
        text books free download
        indian constitution
        LATEST
        telangana history
        CURRENT AFFAIRS

        TELANGANA MAGAZINE

        తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

        TELANGANA MAGAZINE SEPTEMBER 2025

        LEAVE A REPLY

        Please enter your comment!
        Please enter your name here