రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 22లోగా అప్లై చేసుకోవాలి
మొత్తం పోస్టుల సంఖ్య–77
పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/ పీహెచ్డీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాష్ట్ర వైద్య మండలిలో తప్పనిసరిగా నమోదై ఉండాలి.
ఆసక్తి గల వారు నవంబర్ 22లోగా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సిరిసిల్లలో నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు https://rajannasircilla.telangana.gov.in/notice_category/recruitment/





