సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లోని అర్హత కలిగిన ఉద్యోగుల ద్వారా పలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన ఉద్యోగులు నవంబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, హార్డ్‌కాపీని సంబంధిత యూనిట్ కార్యాలయానికి సమర్పించాలి. ఈసారి నోటిఫికేషన్ పూర్తిగా ఇంటర్నల్ అభ్యర్థుల కోసం మాత్రమే విడుదలైంది.
పోస్టులు
మొత్తం 82 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. వాటిలో:
- అసిస్టెంట్ ఇంజినీర్ (E&M) E2 గ్రేడ్– 23 పోస్టులు
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) E2 గ్రేడ్ – 4 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (E&M) E1 గ్రేడ్– 33 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) E1 గ్రేడ్– 6 పోస్టులు
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ E1 గ్రేడ్– 16 పోస్టులు
మొత్తం ఈ పోస్టులన్నీ ఇంటర్నల్ అభ్యర్థులతోనే భర్తీ చేయబడతాయి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 10 నవంబర్ 2025
చివరి తేదీ: 24 నవంబర్ 2025
హార్డ్‌కాపీ సమర్పణ గడువు: 26–30 నవంబర్ 2025
దరఖాస్తు విధానం
అభ్యర్థులు తమ దరఖాస్తులను సింగరేణి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి:
http://www.scclmines.com/internal
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించిన తర్వాత, హార్డ్‌కాపీని అసెస్‌మెంట్ రిపోర్ట్‌తో పాటు సంబంధిత జీఎం కార్యాలయానికి సీల్డ్ కవర్‌లో పంపాలి.
అర్హతలు
- గనులు మరియు ఇతర విభాగాల అధిపతులు ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు.
- అభ్యర్థుల సర్వీస్ రికార్డులు, విద్యార్హతలు, అనుభవం వంటి వివరాలను సరిచూసి, అర్హత కలిగిన వారిని మాత్రమే ముందుకు పంపాలని సూచించారు.
- అసెస్‌మెంట్ రిపోర్ట్‌లు తప్పనిసరిగా సీల్డ్ కవర్‌లో జతచేయాలని ఆదేశించారు.
- ఇంటర్నల్ అభ్యర్థులకు వయోపరిమితి (age limit) ఉండదు.
మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్:
www.scclmines.com/internal
హార్డ్‌కాపీలను సమర్పించడానికి గడువు నవంబర్ 26, 2025 వరకు ఉంది. జీఎం కార్యాలయానికి హార్డ్‌కాపీతో పాటు అభ్యర్థి అసెస్‌మెంట్ రిపోర్ట్‌ను నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. కార్పొరేట్ కార్యాలయానికి హార్డ్‌కాపీలు నవంబర్ 30, 2025 లోపు అందించాలి.







