సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నట్లు సింగరేణి సిఎండి శ్రీధర్ ప్రకటించారు. వీటికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొత్తం మార్చి నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి దానిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సీఎండీ ప్రకటన విడుదల చేశారు.
651 ఖాళీలలో 569 కార్మిక ఉద్యోగాలు, 82 ఆఫీసర్ పోస్టులున్నాయి. ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు.
569 కార్మిక పోస్టుల ఖాళీలు
జూనియర్ అసిస్టెంటు (క్లర్కులు)-177 పోస్టులు,
ఫిట్టర్లు-128,
ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51,
వెల్డర్ ట్రైనీలు-54,
టర్నర్/ మెషినిస్టు ట్రైనీలు-22,
మోటర్ మెకానిక్ ట్రైనీలు-14,
మౌల్డర్ ట్రైనీలు-19
ఆసుపత్రులలో ఉన్న ఖాళీలు
జూనియర్ స్టాఫ్ నర్స్-84 పోస్టులు,
ల్యాబ్ టెక్నిషీయన్లు-7,
ఫార్మాసిస్టులు-5,
ఎక్స్-రే, ఇ.సి.జి., వెంటిలేటర్ విభాగాల్లో రెండేసి పోస్టులు,
ఫిజియోథెరపీ, వెంటిలేటర్ విభాగంలో ఒక్కొక్క పోస్టు.
ఆఫీసర్ పోస్టుల ఖాళీల వివరాలు
మైనింగ్ విభాగంలో
మేనేజిమెంటు ట్రైనీలు-39 పోస్టులు,
పర్సనల్ ఆఫీసర్-17,
మేనేజిమెంటు ట్రైనీలు (ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్)-10,
సివిల్ విభాగంలో
మేనేజిమెంటు ట్రైనీలు-7,
మేనేజిమెంటు ట్రైనీలు (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-6,
జూనియర్ అటవీ అధికారి-3
1,436 పోస్టుల్లో ఇంటర్నర్ అభ్యర్థులకు ఛాన్స్
సింగరేణిలో ఏర్పడే ఖాళీలలో సంస్థలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్ధులకు కూడా అవకాశం ఇస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాయాలల్లో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను ఇంటర్నల్ అభ్యర్ధులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఇంటర్నల్ సర్క్యూలర్ల ద్వారా ధరఖాస్తులను ఆహ్వానించి, ఈ నియామకాలు చేపడుతారు.
ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేసే పోస్టులు
ఇ.పి. ఆపరేటర్ ట్రైనీలు-210 పోస్టులు,
ఇ.పి. ఆపరేటర్ ఫిట్టర్ ట్రైనీలు-178,
క్లర్కులు (జూనియర్ అసిస్టెంట్స్)-177,
వార్డు అసిస్టెంట్లు-175,
ఆయా పోస్టులు-94,
డ్రైవర్లు-64,
వెల్డర్లు ట్రైనీలు-55,
అసిస్టెంట్ ఫోర్ మెన్ (మెకానికల్) ట్రైనీలు-56,
ఎలక్ట్రీషీయన్ ట్రైనీలు-51,
ఇ.పి. ఎలక్ట్రీషీయన్ ట్రైనీలు-42,
పిట్ ఆఫీస్ అసిస్టెంట్ (పి.ఓ.ఎ.)-36,
జూనియర్ అకౌంటెంట్లు-24,
టర్నర్ మెషినిస్టు ట్రైనీలు-22,
మౌల్డర్ ట్రైనీలు-19,
మోటార్ మెకానిక్ ట్రైనీలు-14,
స్టోర్ కీపర్స్-13,
జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్స్-8,
ల్యాబ్ టెక్నిషీయన్లు-7,
‘లా’ అసిస్టెంట్స్-5,
ఫార్మాసిస్ట్-5 పోస్టులు,
ఎక్స్రే, ఇ.సి.జి., వెంటిలేటర్ అసిస్టెంట్ పోస్టులకు రెండేసి ఖాళీలు,
డైటిషీయన్, ఫిజియోథెరపిస్టు, డయాలసిస్ టెక్నిషీయన్లకు ఒక్కొక్క పోస్టు
మెరిట్ ప్రకారమే నియామకాలు; యాజమాన్యం
సింగరేణి సంస్థ చేపట్టనున్న అన్ని నియామకాలు అభ్యర్ధుల ప్రతిభ, రాత పరీక్షలో వారికి వచ్చే మార్కుల పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే పరీక్షలకు బాగా సంసిద్ధమవ్వాలి. ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఉండదు. ఎటువంటి పైరవీలకు అవకాశం ఉండబోదు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చేప్తే వారి మాటలకు మోసపోవద్దు.