సిద్దిపేట జిల్లాలో..జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)ఆధ్వర్యంలో పల్లె,బస్తీ దవాఖానాలు సహా పలు కీలక వైద్య విభాగాలలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్లు సెప్టెంబర్ 15న ప్రారంభం కాగా.. రేపటితో ముగియనున్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి వివిధ మెడికల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుంద
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
స్టాఫ్ నర్స్: 40
MLHP/CHO/MO(పల్లె దవాఖాన):37
ANM: 11
ఫార్మసిస్ట్: 10
ల్యాబ్ టెక్నీషియన్: 4
ఫిజిషియన్ (MD/MBBS): 2
అలాగే ఫిజియోథెరపిస్ట్, ఆడియాలజిస్ట్, డెంటల్ మెడికల్ ఆఫీసర్, ఆప్టోమెట్రిస్ట్, సైకాలజిస్ట్ వంటి ఇతర పోస్టులు కూడా ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉన్నాయి.
వయస్సు:
అభ్యర్థులు 2026 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు మించకూడదు. అయితే నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, అలాగే దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
పోస్టుల వారీగా విద్యార్హతలు,వయోపరిమితి, పూర్తి నిబంధనలకు సంబంధించిన వివరాల కోసం సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Recruitment’ విభాగాన్ని సందర్శించాలని అధికారులు తెలిపారు.
అప్లికేషన్ విధానం:
తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, స్థానికత నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్‌తో పాటు మీ విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ డాక్యుబెంట్స్, కాస్ట్ సర్టిఫికెట్ తో పాటు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లను యాడ్ చేయాలి.
చివరి తేదీ: సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్లు ఇవ్వాల్సిన చిరునామా: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC), దుద్దెడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, సిద్దిపేటలో నేరుగా అందజేయాలి.





