Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్​ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్​లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి..? టాపిక్​ వైజ్​ విశ్లేషణ

ఎస్​ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్​లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి..? టాపిక్​ వైజ్​ విశ్లేషణ

ఆగస్ట్ 7న జరిగిన ఎస్​ఐ ప్రిలిమినరీ పేపర్​ ఎలా ఉంది.. ఏయే టాపిక్​ ల నుంచి ప్రశ్నలు వచ్చాయి..? TSLPRB తెలంగాణ పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు నిర్వహించిన ఈ పరీక్షలో 60 మార్కులు సాధించిన అభ్యర్థులందరూ క్వాలిఫై అయినట్లే. వీరందరూ ఫిజకల్​ ఈవెంట్ల అనంతరం మెయిన్​ ఎగ్జామ్​ రాయాల్సి ఉంటుంది. ఈనెల 28వ తేదీన కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ జరుగనుంది. దాదాపు ఆరు లక్షల మంది ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులకు పోటీ పడుతున్నారు. ఇటీవలి ఎస్​ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్​లో వచ్చిన 200 ప్రశ్నల తీరు.. అడిగిన టాపిక్​లపై అవగాహన పెంచుకుంటే..TSLPRB నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంటుంది. అందుకే.. అభ్యర్థుల అవగాహన కోసం ఈ విశ్లేషణ.

SUBJECTNo.OF QUESTIONS
రీజనింగ్​52
అర్థమెటిక్48
ఇండియన్​ హిస్టరీ17
జనరల్​ సైన్స్​18
(బయాలజీ 5, ఫిజిక్స్​ 2
కెమిస్ట్రీ 1, సైన్స్​ అండ్​ టెక్నాలజీ 5
ఎన్విరాన్​మెంట్​ 4)
జాగ్రఫీ18
(ఇండియన్​ జాగ్రఫీ 10
వరల్డ్ జాగ్రఫీ 8)
తెలంగాణ ఉద్యమం16
ఎకానమీ10
పాలిటీ8
కరెంట్​ అఫైర్స్​8
ఇతరములు5

పాలిటీలో బేసిక్స్​పై ప్రశ్నలు

పాలిటీ నుంచి ఇచ్చిన మొత్తం ఎనిమిది ప్రశ్నలనూ ఓ మోస్తారు ప్రిపరేషన్​ స్థాయి వ్యక్తులు కూడా సరైన ఆన్సర్స్​ చేయవచ్చు. పాలిటీలో వచ్చిన ప్రశ్నలన్నీ బేసిక్స్​పైనే వచ్చాయి. రాజ్యాంగంలో ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది? పార్లమెంట్​ అనగా? గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటుకు నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థను ఏమంటారు? ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి పార్టీ వ్యవస్థ ఉంది? రాజ్యాంగేతర సంస్థ ఏది? వంటి ప్రశ్నలను ఎవరైనా సమాధానం ఇచ్చేలా ఉన్నాయి. పాలిటీలో కీలక భాగమైన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా ఈజీగా ఉన్నాయి.

ఎకానమీ

ఎకానమీలో కరెంట్​ ఎకానమీ నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చాయి. నిరుద్యోగం, ప్రణాళికలు, జీడీపీ నుంచి ఒక్కో ప్రశ్న వచ్చినా కఠినంగా మాత్రం లేవు. మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది? ద్రవ్య విధానం అంటే? వంటి ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక దేశ తన నగదును చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ సంస్థ ఆదుకుంటుంది వంటి ప్రశ్నలు వచ్చాయి. మానవ అభివృద్ధి సూచికలపై రెండు ప్రశ్నలను అడిగారు.

కఠినంగా ఇండియన్​ హిస్టరీ ప్రశ్నలు

ఎస్​ఐ ప్రిలిమినరీలో ఇండియన్​ హిస్టరీ నుంచి 17 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. పేపర్​ మిగతా సబ్జెక్టుల నుంచి వచ్చిన ప్రశ్నలు ఫ్యాక్ట్​ బేస్డ్​గా నేరుగా అడిగారు. క్రోనాలజీ ఆధారంగా రెండు ప్రశ్నలు వచ్చాయి. ఉదాహరణకు
కింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగతంగా అమర్చండి?
ఎ. ఇండియన్​ అసోసియేషన్
బి. పునా సార్వజనిక సభ
సి. మద్రాసు మహాజన సభ
డి. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్​
పై ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే భారత జాతీయోద్యమ కాలంలో ఏర్పడిన అన్ని సంస్థలపై అవగాహన ఉండాలి.
మౌర్యులు 1, జైనమతం 1, కవులు– గ్రంథాలు1, ఢిల్లీ సుల్తానులు 1, మొఘలులు 1, మరాఠాలు 1, బహమనీలు 2, భక్తి ఉద్యమం 1, సామాజిక ఉద్యమం 1, మోడ్రన్​ హిస్టరీ నుంచి 6 ప్రశ్నలు వచ్చాయి.
నేరుగా వచ్చి 2 ప్రశ్నలు కూడా కఠినంగానే ఉన్నాయని చెప్పాలి. ఇండియన్​ హిస్టరీ ప్రశ్నలకు లోతుగా చదివిన అభ్యర్థులు మాత్రమే సమాధానం ఇచ్చేలా ఉన్నాయి. అంటే.. ఇండియన్​ హిస్టరీలో అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా క్వశ్చన్స్​ ఫ్రేమ్​ చేసినట్టు కనిపిస్తున్నది. ప్రతిసారి ప్రశ్నలు వచ్చే సింధు నాగరికత, వేద నాగరికతల నుంచి ప్రశ్నలు రాలేదు.

కరెంట్​ అఫైర్స్​ అంతర్జాతీయ సంబంధాలు

కరెంట్​ అఫైర్స్​ అంతర్జాతీయ సంబంధాలు నుంచి అడిగిన ఎనిమిది ప్రశ్నల్లో అంతర్జాతీయ సంబంధాల నుంచే ఆరు ప్రశ్నలు వచ్చాయి. ఇందులో రెండు ప్రశ్నలు మినహా ఏ ఖండంలోని అన్ని దేశాలు జి–77లో సభ్య దేశాలు? న్యూడెవలప్మెంట్​ బ్యాంక్​లో 2021ల కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది? 2023లో జరగనున్న షాంగై హై కో ఆపరేషన్​ ఆర్గనైజేషన్​ శిఖరాగ్ర సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి? అనే నాలుగు ప్రశ్నలు కూడా అంతర్జాతీయ సంస్థలకు చెందినవే కావడం గమనార్హం. దీని దృష్ట్యా పోటీ పరీక్ష ఏదైనా అంతర్జాతీయ సంస్థలకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యసభ ఎన్నికలపై ఒక్కో ప్రశ్న వచ్చింది.

జాగ్రఫీ

సిలబస్​లో పేర్కొన్నట్లుగానే వరల్డ్​ జాగ్రఫీ నుంచి 8, ఇండియన్​ జాగ్రఫీ నుంచి 10 ప్రశ్నలు వచ్చాయి. ప్రకృతి సిద్ధమండాలాల నుంచే మూడు ప్రశ్నలు ఇచ్చారు. విశ్వం1, అడవులు 1, భూస్వరూపాలు 1, వాతావరణం 1, ఇండియన్​ జాగ్రఫీలో భౌతిక స్వరూపం 2, రవాణా వ్యవస్థ 2, మృత్తికలు 1, శక్తి వనరులు 1, వ్యవసాయం 1, కనుమలు నుంచి 1 ప్రశ్న వచ్చింది. వీటిలో తేదీలపై రెండు ప్రశ్నలు అడిగారు. నదులు, నీటి పారుదల ఈసారి ప్రశ్నలు అడగకపోవడం గమనిచాల్సిన విషయం. జాగ్రఫీ నుంచి వచ్చిన 18 ప్రశ్నల్లో సగం ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. తెలంగాణ జాగ్రఫీ నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు.

తెలంగాణ ఉద్యమ చరిత్ర

తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 16 ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నలు చాలా వరకు సాధారణ స్థాయిలో ఉన్నాయి. పార్టీలు, సంస్థలు, విద్యార్థి సంఘాలు 3, జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ 2, గిర్​గ్లానీ కమిషన్​ 1, పెద్ద మనుషుల ఒప్పందం, ఉల్లంఘనలు 3, షోయాబుల్లా ఖాన్​పై 1, తెలంగాణ ప్రజా సమితి 1, నిజాం సబ్జెక్ట్స్​ లీగ్​ 1, తొలి, మలి దశ ఉద్యమ నాయకులపై ఒక్కో ప్రశ్న వచ్చింది. కొన్ని ప్రశ్నలు మినహా మిగతా ప్రశ్నల స్థాయి సాధారణంగా ఉంది. ఓ మోస్తారు స్థాయిలో ప్రిపరేషన్​ కొనసాగించిన వారు జవాబులు గుర్తించేలా ప్రశ్నలు వచ్చాయి.

జనరల్​ సైన్స్​ అండ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ

ఈ విభాగంలో బయాలజీ 5, ఫిజిక్స్​ 2, కెమిస్ట్రీ 1, సైన్స్​ అండ్​ టెక్నాలజీ 5, పర్యావరణ అంశాలు 4 ప్రశ్నలు వచ్చాయి. ఓజోన్​ పొర సంబంధిత ప్రశ్నలే 4 వచ్చాయి. ఎప్పటిలాగానే విటమిన్స్​ ఒక్క ప్రశ్న వచ్చింది. సైన్స్​ అండ్​ టెక్నాలజీ స్పేస్​ రంగం అని భ్రమణలను ఎస్​ఐ ప్రిలిమ్స్​ పేపర్​ తొలగించింది. నాసా అబ్రివేషన్​ మినహా ఇండియన్​ స్పేస్​ నుంచి ఎలాంటి ప్రశ్నలు రాలేదు. న్యూక్లియర్​, ఇంటర్నెట్​, డేటా సైన్స్​ నుంచి ప్రశ్నలు వచ్చాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!