స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ ఎస్ సీ) మరో 900 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు.. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 18 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. డిసెంబర్ లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉండే అవకాశముంది. పూర్తి వివరాలు ఎస్ ఎస్ సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
Job
.