ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్షిప్ అప్లికేషన్లకు మార్చి 31 వరకు గడువు పెంచుతున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 24 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తులు స్వీకరించాగా ఈ సారి కరోనా కారణంగా అనేక మంది స్టూడెంట్లు రిజిస్టర్ చేసుకోలేదు. 7,97,656 మందికి గాను 5,86,011 మంది స్టూడెంట్లు మాత్రమే రెన్యూవల్ చేసు కున్నారు. ఇందులో 5,50,000 మంది రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు 29,246 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. సీపీగెట్, డైట్ సెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీసెట్ కౌన్సెలింగ్ డేటా ఇంకా ఫైనల్ కాకపోవడంతో స్కాలర్షిప్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని స్టూడెంట్లు, కాలేజీలు మార్చి 31లోగా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
వెబ్సైట్: www.telanganaepass. cgg.gov.in