సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 33 ఖాళీలను కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేయనున్నారు. వీటిలో 30 పోస్టులు జనరల్ మెడికల్ కన్సల్టెంట్ కోసం, మిగిలిన 3 పోస్టులు (డెంటల్) కోసం కేటాయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు SCCL యొక్క అధికారిక వెబ్‌సైట్ scclmines.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆగస్ట్ 25 లోపు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు :
మొత్తం పోస్టులు: 33
జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు- 30
డెంటల్ పోస్టులు – 03
అర్హతలు:
జనరల్ మెడికల్ కన్సల్టెంట్: ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి MBBS పూర్తి చేసి ఉండాలి.
జనరల్ మెడికల్ కన్సల్టెంట్ (డెంటల్): ఈ పోస్టుకు BDS లేదా మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అర్హత అవసరం.
వయస్సు: గరిష్టంగా 64 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయో పరిమితో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ:
అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆగస్ట్ 25 వతేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
జీతం,ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం లభిస్తుంది. జనరల్ మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 85,000 లేదా గంటకు రూ. 400 వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. ఆన్ లైన్ అప్లికేషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ చెక్ చేయవచ్చు.





