ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 2026 సంవత్సరానికి గాను స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) విభాగంలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (MMGS-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో 88 రెగ్యులర్ ఖాళీలు ఉండగా.. 12 బ్యాక్‌లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జూన్ 2వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ప్రధానంగా హైదరాబాద్, కోల్‌కతా కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది (అవసరాన్ని బట్టి ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు). ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం: మే 13 వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జూన్ 2వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు IIBF నుంచి ‘Forex Operations’ లో సర్టిఫికేషన్ తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 30.04.2026 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి .ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
అనుభవం: ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్ విభాగంలో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ. 64,820 నుంచి ప్రారంభమై రూ. 93,960 వరకు ఉంటుంది. దీంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ముందుగా వారి విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/web/careers ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ , ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.





