స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)..వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలోని వివిధ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 996 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. జనవరి 5వ తేదీ వరకు అభ్యర్థులు sbi.bank.in ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్టుల సంఖ్య- 996
అధికారిక వెబ్‌సైట్- sbi.bank.in
విభాగాల వారిగా ఖాళీలు:
VP Wealth (SRM):506 పోస్టులు
AVP Wealth (RM):206 పోస్టులు
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ (ఫైనాన్స్/మార్కెటింగ్) లేదా NISM/CFP/CFA వంటి సర్టిఫికేషన్లు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు (01-05-2025 నాటికి): 20 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
అనుభవం: సంబంధిత రంగంలో (సేల్స్/మార్కెటింగ్/వెల్త్ మేనేజ్‌మెంట్) పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రధానంగా రెండు దశల్లో ఉంటుంది.
అప్లికేషన్ల షార్ట్‌లిస్టింగ్
పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎలా అప్లై చేయాలి ?
అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in లోని ‘Careers’ పేజీకి వెళ్లి.. ‘Current Openings’ విభాగంలో ఈ నోటిఫికేషన్‌ను సెలక్ట్ చేసుకుని ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.





