స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 996 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోస్టుల సంఖ్యను 1,146 కి పెంచుతూ సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జనవరి 10వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
మొత్తం ఖాళీలు: 1146
పోస్టుల పేర్లు: VP వెల్త్ (SRM), AVP వెల్త్ (RM), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్.
ఖాళీల వారిగా వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
VP వెల్త్ (సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్): 582 పోస్టులు
AVP వెల్త్ (రిలేషన్‌షిప్ మేనేజర్): 327 పోస్టులు
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 237 పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. MBA (Banking/Finance/Marketing) లేదా NISM, CFP వంటి సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు(మే 01, 2025 నాటికి):
రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 26 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు 23 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 – 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అభ్యర్థుల ప్రొఫైల్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
అప్లై చేయడం ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా అప్లై చేసుకోవాలి.





