బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరి పోయే గుడ్ న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలోని వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 207 పోస్టులను భర్తీ చేయనున్నారు. వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు, పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 207 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జోనల్ హెడ్ (రిటైల్), రీజినల్ హెడ్, రిలేషన్‌షిప్ మేనేజర్–టీమ్ లీడ్, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, వీపీ వెల్త్ , ఏవీపీ వెల్త్ వంటి పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 17 ఎస్‌బీఐ సర్కిళ్ల పరిధిలో ఈ పోస్టులను కేటాయించారు. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిళ్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీ:
అప్లికేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 5 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
జీతం,కాంట్రాక్ట్ వివరాలు:
జోనల్ హెడ్ పోస్టుకు రూ.97.00 లక్షల వరకు వార్షిక జీతం లభిస్తుంది. రీజినల్ హెడ్ పోస్టుకు రూ.66.40 లక్షలు ఉంటుంది. అంతే కాకుండా రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుకు రూ.51.80 లక్షలు, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ.44.50 లక్షలు, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు రూ.27.10 లక్షల జీతం ఇస్తారు. ఇవే కాకుండా పనితీరును బట్టి పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే అదనంగా అందుతుంది. ఈ నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు అవసరాలను బట్టి.. మరో 4 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది.
అర్హతలు, వయో పరిమితి:
ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు, పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. సాధారణంగా గ్రాడ్యుయేషన్ లేదా పీజీ డిగ్రీతో పాటు ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో 3 నుంచి 15 సంవత్సరాల వరకు అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 23 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజును ఆన్‌లైన్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన.. వారికి పర్సనల్ లేదా వీడియో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?
1.ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయండి.
2.తర్వాత ‘Careers’ సెక్షన్‌లోకి వెళ్లి ‘Current Openings’ క్లిక్ చేయండి.
- సంబంధిత ‘CRPD/SCO/2026-27/23’ నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి వివరాలు చదవండి.
- తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేసిన తర్వాత ప్రింటవుట్ తీసుకోండి.





