స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)..స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 996 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. అభ్యర్థులు డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటికేషన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు :
మొత్తం- 996 పోస్టులు
సంస్థ పేరు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్టు పేరు- స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
విభాగాల వారిగా పోస్టులు:
వీపీ వెల్త్- 506
ఏవీపీ వెల్త్- 206
కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్- 284
విద్యార్హతలు: అభ్యర్థులు.. తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు MBA/PGDM (బ్యాంకింగ్/ఫైనాన్స్/మార్కెటింగ్) అర్హత కలిగి ఉండాలి.
వయస్సు:
వీపీ వెల్త్ (SRM): ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనిష్టంగా 26 సంవత్సరాలు, గరిష్టంగా 42 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
ఏవీపీ వెల్త్ (RM): ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనిష్టంగా 23 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: అభ్యర్థులు కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC/ST/OBC వంటి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 750 చెల్లించాలి. SC/ST/PwBD అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది.
షార్ట్‌లిస్టింగ్: అప్లికేషన్ల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ: పర్సనల్ / టెలిఫోనిక్ / వీడియో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
CTC నెగోషియేషన్: జీతం ప్యాకేజీపై చర్చిస్తారు.
మెరిట్ లిస్ట్: ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
ఎలా అప్లై చేయాలి ?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in లోని “Careers -> Current Openings” ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. అప్లికేషన్లో అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి. అన్ని డాక్యుమెంట్‌లను (ఫోటోగ్రాఫ్, సంతకం, రెజ్యూమ్, విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్లు మొదలైనవి) అప్‌లోడ్ చేయండి. అనంతరం అప్లికేసన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి. చివరగా.. అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.





