బ్యాంకు ఉద్యోగాలకు పోటీ పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాదిలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఎస్ బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22,542 బ్రాంచీలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారుల కోసం కొత్తగా మరో 600 బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. వీటిలో అవసరమైన బ్యాంకింగ్ సేవలు, సాంకేతికంగా బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరిన్ని ఉద్యోగ నియామకాలు చేపడుతామని ఎస్బీఐ ఛైర్మన్ వెల్లడించారు. ఇటీవలే ఎస్ బీఐలోని వివిధ భాగాల్లో 1500 మంది సాంకేతిక నిపుణుల నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు గడువు పెంపు
మార్చి 2024 నాటికి ఎస్బీఐలో 2,32,296 మంది సిబ్బంది ఉన్నారు. పెరుగుతున్న కస్టమర్లు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరో 10వేల ఉద్యోగులు అవసరమవుతాయని ఎస్బీఐ అంచనా వేసింది. డేటా సైంటిస్టు, డేటా ఆర్కిటెక్టు, నెట్‌వర్క్ ఆపరేటర్లతో సహా మరిన్ని విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది.
ఎస్బీఐలో 10 వేల ఉద్యోగాల జాతర
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS