బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ అసోసియేట్ (క్లర్క్) కేటగిరీలో భారీగా ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక నియామక డ్రైవ్ ద్వారా మొత్తం 1538 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఈ బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారిగా పోస్టులను విభజించారు కాగా.. తెలంగాణలో 32,ఏపీలో 88 పోస్టులు ఉన్నాయి. ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థుల కోసం మాత్రమే కేటాయించారు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు:
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఓబీసీ అభ్యర్థులు రూ. 750 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
విద్యార్హత, వయోపరిమితి వివరాలు:
అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రొవిజనల్గా అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు నిర్ణీత తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. కేటగిరీల వారీగా ప్రభుత్వం అందించే నిబంధనలు కూడా పూర్తిగా వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు మొదట ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్లో మెయిన్ పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించనున్నారు. దీంతో పాటు స్థానిక భాషా నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు పరీక్ష సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జీతం :
ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగంలో చేరిన వారికి బేసిక్ పే రూ.26,730 వరకు ఉంటుంది. ముంబై వంటి మెట్రో నగరాల్లో నెలకు దాదాపు రూ.46,000 వరకు జీతం ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు, మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ స్కీమ్, ఇతర బ్యాంక్ పరమైన సదుపాయాలు అభ్యర్థులకు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





