నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలోని మొత్తం 9124 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో కూడా ఎక్కువగానే పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సర్కిల్ పరిధిలోకి వచ్చే తెలంగాణలో మొత్తం 260 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.ఇక ఏపీ విషయానికి వస్తే, అమరావతి , చెన్నై సర్కిళ్ల పరిధిలో స్థానికతను బట్టి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్ గురించిన వివరాలు:
అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 11 నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
చివరి తేదీ: అభ్యర్థులు ఆగస్ట్ 31వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష: సెప్టెంబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
మెయిన్ పరీక్ష: నవంబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రొవిజనల్‌గా అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
జనరల్, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.750గా ఉంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ మోడ్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటగా.. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో.. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. ఒకవేళ స్థానిక భాషలో టెన్త్ లేదా ఇంటర్ చదవక పోతే.. సెలెక్ట్ అయిన వారికి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT) నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసే సమయంలో మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఎడమ చేతి ఫింగర్ ప్రింట్స్, చేతితో రాసిన డిక్లరేషన్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ sbi.bank.in సంప్రదించవచ్చు.





