HomeJOBSఎస్బీఐలో 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

ఎస్బీఐలో 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)..దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2273 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2050 రెగ్యులర్ ఖాళీలు, 223 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగి ఉన్న వారు ఫిబ్రవరి 18 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 2273

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

అనుభవం: అభ్యర్థులకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో కనీసం 2 ఏళ్ల అనుభవం (డిసెంబర్ 31, 2025 నాటికి) ఉండాలి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)

జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (ఇతర అలవెన్సులు)మధ్య జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: జనవరి 29వ తేదీ నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

చివరి తేదీ: ఫిబ్రవరి 18 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:
ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది.

ఆన్‌లైన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ (120 మార్కులు) , డిస్క్రిప్టివ్ (50 మార్కులు) పరీక్షలు ఉంటాయి. నెగటివ్ మార్కులు ఉండవు.

స్క్రీనింగ్: అభ్యర్థి అర్హతలు, జాబ్ ప్రొఫైల్‌ను బ్యాంక్ కమిటీ పరిశీలిస్తుంది.

ఇంటర్వ్యూ: 50 మార్కులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

స్థానిక భాషా పరీక్ష: ఎంపికైన అభ్యర్థులు సంబంధిత సర్కిల్‌కు చెందిన స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 750, కాగా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here