పదో తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించేందుకు సదవకాశం. సశస్త్ర సీమ బల్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టులు 399 ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతి/తత్సమాన పరీక్ష పాసై, నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. వయసు 18- నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఖాళీలను ప్రస్తుతం టెంపరరీ బేసిస్‌లో భర్తీ చేస్తారు. భవిష్యత్‌లో పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈవెంట్లు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన అంశాల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
ఈవెంట్లు: జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపక్ తక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, యాచింగ్ క్రీడలు ఉన్నాయి.
ఫీల్డ్ ట్రయల్/స్కిల్ టెస్ట్: డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఈ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు, జాతీయ స్థాయి పతకాలు గెలుచుకున్నవారికి స్కిల్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంకా ఖాళీలు మిగిలినట్లయితే ఆల్ ఇండియా యూనివర్సటీ, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో గెలిచినవారికి ఫీల్డ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ): ఫీల్డ్ ట్రయల్‌లో అర్హత సాధించిన వారికి పీఎస్‌టీ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 170 సెం.మీ. ఎత్తు, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.ఉండాలి. పర్వత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ విషయంలో మినహాయింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్స్ పంపాల్సిన అడ్రస్: ది ఇన్‌స్పెక్టర్ జనరల్, ఫ్రంటియర్ హెడ్ క్వాటర్, ఎస్‌ఎస్‌బీ పట్నా, 3వ ఫ్లోర్, కార్పురీ ఠాకుర్ సదన్, అషియానా-ఢోగ్లా రోడ్, పట్నా – 800 025, బిహార్. వివరాలకు www.ssbrectt.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.
Nenu join
Ok
Nice job😊
It’s not good job
Please sir
Please sir I won’t job sir
Villege kirgul k mandal basar district Nirma
How we apply
Please sir i wont job sir
Please sir I will job
Nice job