HomeJOBSసనత్ నగర్ టిమ్స్‌‌లో 184 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు

సనత్ నగర్ టిమ్స్‌‌లో 184 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. సనత్ నగర్ ‘తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (TIMS) హాస్పిటల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ విభాగాలను టాప్ క్లాస్ ప్రమాణాలతో నడిపించేందుకు నిమ్స్ (NIMS) యాజమాన్యం ఒకేసారి 184 ఖాళీల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయస్సుతో పాటు మరిన్ని వివరాలు..

పోస్టుల వివరాలు :

మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు (మొత్తం – 31):
ఇందులో ప్రొఫెసర్లు – 5, అసోసియేట్ ప్రొఫెసర్లు – 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 24 పోస్టులు ఉన్నాయి. కార్డియాలజీ, సీటీవీఎస్, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్/సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతాయి.

టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు (మొత్తం – 122):
ల్యాబ్ టెక్నీషియన్లు, అనస్థీషియా, బ్లడ్ బ్యాంక్, ఎంఆర్ఐ, సీటీ, ఎక్స్‌రే, క్యాత్ ల్యాబ్, ఈసీజీ, బయోమెడికల్ టెక్నీషియన్లు, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, స్టాటిస్టిషియన్, రిజిస్ట్రార్, అకౌంట్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఇతర సపోర్ట్, ఇంజినీరింగ్ పోస్టులు (మొత్తం – 31):
లీగల్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పర్‌ఫ్యూజనిస్టులు, బయోమెడికల్, సాఫ్ట్‌వేర్,హార్డ్‌వేర్ ఇంజనీర్లు, ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్లు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్, ప్లాస్టర్ అసిస్టెంట్లు తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు:
మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో DM/M.Ch/DNB/DrNB తో పాటు నిమ్స్, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు ఆయా పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ, బీఎస్సీ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ అర్హతలు నిర్ణయించారు.

వయస్సు:
మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 50 నుంచి 58 సంవత్సరాలు. ఇతర పోస్టులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఉంటుంది. కాగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు లభిస్తుంది.

అప్లికేషన్ విధానం:

మెడికల్ ఫ్యాకల్టీ: అర్హులైన అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన ఫారంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో జూలై 6న ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలి. సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ప్రతిభ, పరిశోధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ – ఇతర పోస్టులు: అభ్యర్థులు నిర్ణీత నమూనాలో అప్లికేషన్ పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లజిరాక్స్ లను జతచేసి జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్ కార్యాలయంలో సమర్పించాలి. అప్లికేషన్ల సంఖ్య ఆధారంగా ఇంటర్వ్యూ లేదా స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఫీజును “The Director, NIMS, Hyderabad” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో లేదా నిమ్స్ పాత బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఐపీ బిల్లింగ్ కౌంటర్‌లో చెల్లించవచ్చు.

మెడికల్ ఫ్యాకల్టీ: జనరల్ అభ్యర్థులకు రూ.2,000, ఎస్‌సీ/ఎస్‌టీలకు రూ.1,000.

ఇతర పోస్టులు: జనరల్ అభ్యర్థులకు రూ.1,000, ఎస్‌సీ/ఎస్‌టీలకు రూ.500.

అప్లికేషన్లకు చివరి తేదీ:

అభ్యర్థులు జూలై 6, 2026 (సాయంత్రం 4:00 గంటల వరకు) ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోడానికి అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here