విద్యార్థుల్లో దేశ భక్తిని నింపి.. వారు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించేలా డిఫెన్స్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునేలా.. సైనిక పాఠశాలలు తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం అనేక మంది పేరెంట్స్ తమ పిల్లలను సైనిక పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లపై కీలక ప్రకటన చేసింది. సైనిక స్కూళ్లలో అడ్మిషన్ల కోసం జనవరి 8, 2023న ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. దేశంలోని 180 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతి మరియు తొమ్మిదో తరగతిలో అడ్మిషన్లకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
6వ తరగతిలో చేరాలంటే: అభ్యర్థుల వయస్సు మార్చి 31, 2023 నాటికి 10 నుంచి 12 ఏళ్లు ఉండాలి.
9వ తరగతిలో చేరాలంటే: అభ్యర్థుల వయస్సు మార్చి 31, 2023 నాటికి 13 నుంచి 15 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన స్కూల్ నుంచి 8వ తరగతి పాసై ఉండాలి.
పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.650 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.