రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే యాక్ట్.. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,116 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు.. ఆర్‌ఆర్‌సీ నార్తర్న్, రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 24వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 4116
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే
పోస్ట్ పేరు: అప్రెంటిస్
అర్హతలు:
1. విద్యార్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన NCVT/SCVT నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
2. వయస్సు: (24.12.2025 నాటికి)
ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
మెరిట్: టెన్త్, ఐటీఐ (ITI) పరీక్షల్లో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ : మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
మెడికల్ ఫిట్‌నెస్: నిబంధనల ప్రకారం.. వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
🔹 అప్లికేషన్ ఫీజు :
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీ వరకు అప్లైచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి ?
అర్హత గల అభ్యర్థులు ఆర్‌ఆర్‌సీ నార్తర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా www.rrcnr.org లోకి లాగిన్ అవ్వండి. తర్వాత నోటిఫికేషన్.. “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అనంతరం సరైన వివరాలతో అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు.. (ఫోటో, సంతకం, సర్టిఫికేట్‌లు) అప్‌లోడ్ చేసి.. అప్లికేషన్ ఫీజు చెల్లించి ప్రింటౌట్ తీసుకోండి.





