HomeLATESTఫిబ్రవరి 23 నుంచి గ్రూప్​–డీ ఎగ్జామ్స్​

ఫిబ్రవరి 23 నుంచి గ్రూప్​–డీ ఎగ్జామ్స్​


ఆర్​ఆర్​బీ గ్రూప్​ – డీ పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఎగ్జామ్స్​ 2022 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సౌత్​ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. పరీక్షకు పది రోజుల ముందు నుంచి అభ్యర్థి ఎగ్జామ్​ డేట్​, సెంటర్​ వివరాలు తెలియజేస్తామన్నారు. ఎగ్జామ్​ మల్టీఫేజ్​లో నిర్వహించనున్నారు. పూర్తి సమచారం కోసం www.rrbsecundrabad.nic.in వెబ్​సైట్​లో చూడవచ్చు. కరోనా రూల్స్​ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

నిఫ్ట్‌లోఅసిస్టెంట్‌ ప్రొఫెసర్​ జాబ్స్​


న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 190


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌/ పరిశోధన అనుభవం ఉండాలి.

Advertisement


వయసు: 31 జనవరి 2022 నాటికి 40 ఏళ్లు మించరాదు.


జీతం: నెలకి రూ.56100 + కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

Advertisement


ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌-1 50 మార్కులకి జనరల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2 50 మార్కులకి ప్రొఫెషనల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రజంటేషన్‌/ క్లాస్‌ రూం లెక్చర్‌కి ఎంపిక చేస్తారు. దీనిలో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మూడింట్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


చివరి తేది: 31 జనవరి 2022.

అడ్రస్​: రిజిస్ట్రార్‌ కార్యాలయం, హెడ్‌ ఆఫీస్‌, నిఫ్ట్‌ క్యాంపస్‌, హజ్‌ ఖాస్‌, న్యూఢిల్లీ – 110016.
వెబ్​సైట్: www.nift.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!